ఆధార్ కార్డు ద్వారా జరిగే మోసాలకు అడ్డుకట్ట ఇలా…!

హైదరాబాద్, జూలై:దేశంలో పౌరులందరికీ 12అంకెల ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆధార్ నంబర్ ఉంటుంది. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, నకిలీ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ నిర్వహించేందుకు మోసగాళ్లు ఆధార్ నెంబర్‌ను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆధార్ కార్డుదారులు తమ కార్డులు దుర్వినియోగం కాకుండా, సురక్షితంగా ఉండేలా యూఐడీఏఐ అందించిన లాక్,అన్‌లాక్ ఫీచర్‌ను ఉపయోగించాలి. మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్‌ను లాక్ ఎలా చేయాలంటే…?
‘మీ ఆధార్‌ను ఎవరైనా దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు మీ ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేయండి. మీ ఆధార్‌ను లాక్, అన్‌లాక్ చేయడానికి mAadhaar యాప్‌ను ఉపయోగించండి లేదా https://resident.uidai.gov.in/aadhaar-lockunlock పై క్లిక్ చేయండి. ఈ సేవలకు మీ VID తప్పనిసరి అని తెలిపింది.

మీ ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేసేందుకు… https://resident.uidai.gov.in/aadhaar-lockunlock వెబ్ సైట్ లోకి వెళ్లండి. – Secure UID Authentication Channel సెక్షన్‌లోని Lock UID లేదా Unlock UID ఆప్షన్‌ను ఎంచుకోండి. – Lock UID సెలక్ట్ చేశాక మీ 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్, పేరు, పిన్ కోడ్, ఆధార్ ఇతర వివరాలు ఇవ్వాలి. తర్వాత కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం Send OTP పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వస్తుంది. – వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవుతుంది.
mAadhaar యాప్ ద్వారా…

mAadhaar ద్వారా లాక్ చేయడం mAadhaar యాప్ ద్వారా మీ ఆధార్ కార్డును లాక్ చేయడానికి లేదా అన్ లాక్ చేయడానికి ఇలా చేయండి…. – మీ మొబైల్ ఫోన్లో mAadhaarను ఓపెన్ చేయాలి. మీ అకౌంట్‌కు లాగిన్ కావాలి. – My Aadhaar యాప్ పైన క్లిక్ చేయాలి. Aadhaar Lock ఆప్షన్‌ను ఎంచుకోండి. – Confirmation సందేశాన్ని యాక్సెప్ట్ చేయాలి. Lock Aadhaar పైన క్లిక్ చేయాలి. – మీ ఆధార్ నెంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్, ఆ తర్వాత కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. – ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి. ఈ పాస్ వర్డ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. ధృవీకరించిన తర్వాత మీ ఆధార్ కార్డ్ లాక్ అవుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

