ఎవరు?
అంత్రాన ఆ గోళాలను గిరగిర తిప్పుతున్నదెవరు మిన్ను మన్నుల మధ్యన ఆ బంతులతో ఆడుకుంటున్న దెవరు?
అంత్రాన ఆ గోళాలను
గిరగిర తిప్పుతున్నదెవరు
మిన్ను మన్నుల మధ్యన
ఆ బంతులతో ఆడుకుంటున్న దెవరు?
అటు – ఇటు
అంతు తెలువని మైదానం
గోళాలలోని జీవులకు
సర్కస్ గ్లోబులో సవారీ చేసినా
పడిపోనట్లు ఉంటుంది
గోళాల అస్తిత్వానికి
ఊపిరి పోస్తున్న దెవరు?
శూన్యం రహదారుల్లో గోళాలకు
గందరగోళం లేకుండా
దారులు చూపుతున్న
ట్రాఫిక్ పోలీస్ ఎవరు?
ఎంతటి క్రమశిక్షణ!
ఎంతటి సమయ పాలన!
అంతటి సుశిక్షిత శిక్షకుడెవరు?
కక్ష్యలలో తిరుగుతున్నా వాటి
కక్షలు లేని అరమరికల
నీడలే చీకటి వెలుగుల గోడలు !
భ్రమణాలు పరిభ్రమణాలలో
జీవులంతటికి రక్షణ కల్పిస్తున్న
ఆ అదృశ్య రక్షకుడు ఎవరు ?
– పి.బక్కారెడ్డి
9705315250
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

