ఈజీగా …ఇన్ స్టెంట్ పాన్ కార్డు ఇలా పొందొచ్చు…

హైదరాబాద్ ,జూన్ 21: ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, బ్యాంకు ఖాతా ఓపెనింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం మొదలైన వాటికి కేవైసీ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి. పొరపాటున పాన్ కార్డు పోగొట్టుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఇన్ స్టెంట్ పాన్ కార్డు పనికివస్తుంది. ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం ఆదాయ పన్నుశాఖ కల్పిస్తున్నది.

ఆదాయ పన్ను వెబ్ సైట్లోకి లాగిన్ కావడం ద్వారా ఈ-పాన్ కార్డును పొందవచ్చు. పాన్ కార్డు నెంబర్ గుర్తుకు లేకపోతే ఆధార్ నెంబర్‌తో దీనిని పొందవచ్చు. ఇందుకోసం ఆధార్-పాన్ అనుసంధానం చేసుకొని ఉండాలి. పాన్ నెంబర్ గుర్తుకు లేకుంటే ఆధార్-పాన్ అనుసంధానం ఇదివరకే పూర్తయితే ఆధార్ నెంబర్‌తో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆధార్ పాన్ లింక్ లేకపోతే కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ నుంచి ఈ-పాన్‌ను డౌన్లోడ్ చేయడం కుదరదు.
ఈ -పాన్ డౌన్లోడ్ చేయడానికిhttps://www.incometaxindia.gov.in పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
- ఎడమ పక్కన దిగువ భాగంలోని Our Services పై క్లిక్ చేయాలి
- అక్కడ Instant E-PAN క్లిక్ చేయాలి.
- New E PAN వద్ద క్లిక్ చేయండి – మీరు కోల్పోయిన పాన్ కార్డు నెంబర్ మీకు గుర్తు లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేయాలి.
- నిబంధనలు, షరతులను చదివిన తర్వాత Accept పైన క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
- OTPని నమోదు చేసి ,వివరాలను జాగ్రత్తగా చేక్ చేసుకొని, మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి, Confirm పైన క్లిక్ చేయాలి.
- ఈ-మెయిల్ ఐడీకి మీ ఈ-పాన్ వస్తుంది.
- -అక్కడ ఈ-పాన్ PDFను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

