న్యూఢిల్లీ, జనవరి 23: దేశీయ మార్కెట్లోకి నయా యాక్టివా స్కూటర్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ). రాబోవు ఉద్గార నియమ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ స్కూటర్ రూ.74,536 ప్రారంభ ధరతో లభించనున్నది. ఈ ధర ఢిల్లీ షోరూంనకు సంబంధించినది. మూడు రకాల్లో లభించనున్న ఈ మోడల్ రూ.74,536, రూ.77,036, రూ.80,537 ధరలు నిర్ణయించింది.