టీనేజ్ బాలికలే టార్గెట్ : కేరళలో డ్రగ్స్, సెక్స్ రాకెట్ గుట్టు రట్టు!

తిరువనంతపురం : లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కేరళలో చాలాకాలంగా సాగుతున్న డ్రగ్, సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. ఈ ముఠా మలప్పురానికి చెందిన 14 ఏండ్ల బాలికను డ్రగ్స్‌కు బానిస చేసి నెలల తరబడి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని చైల్డ్‌లైన్ ఈ రాకెట్‌ను ఛేదించి బాలికను కాపాడింది. ఇన్స్టాగ్రాం ద్వారా స్కూల్‌కు వెళ్లే చిన్నారులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటోంది. ఆన్లైన్లో బాలికలతో స్నేహం చేస్తూ వారికి డ్రగ్స్‌ను అలవాటు చేసి లైంగికంగా వేధిస్తున్నారు. గతవారం టీనేజ్ బాలికను ఈ రాకెట్ చెర నుంచి కాపాడింది. తొలుత నిందితులు తనకు గంజాయి ఇచ్చేవారని ఆపై కొకైన్ ఇతర డ్రగ్స్ ఇచ్చి నెలల తరబడి లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. నిందితుల చెర నుంచి బాలికను కాపాడిన అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి బాధితురాలిని తరలించారు. నిందితులు బాలికకు డ్రగ్స్‌ను అలవాటు చేయడంతో ఆమె విత్‌డ్రాయల్ సింప్టమ్స్‌తో బాధపడుతోంది. బాలిక తెలిపిన వివరాల ఆధారంగా ఈ రాకెట్‌కు సంబంధించి పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఇప్పటికి ఒకరిని అరెస్ట్ చేశామని కల్పకంచెరి పోలీసులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- drugs trade
- Kerala
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

