రమణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాయిజన్’.తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రవిచంద్రన్ దర్శకత్వంలో సీఎల్ఎన్ మీడియా నిర్మిస్తుంది. ఈ చిత్రంలోని ఒక పాటను ఇటీవల హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సంగీత దర్శకుడు నిహారి అందించిన మ్యాడ్ సాంగ్‌ను శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిత్రమిది. హీరో రమణ కెరీర్లో ఈ చిత్రం చిరకాలం నిలిచిపోతుంది’ అన్నారు.