‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు రామ్‌చరణ్. ఈ సక్సెస్‌ను ఆస్వాదిస్తూనే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ఇండియా స్థాయిలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పంజాబ్ అమృత్‌సర్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ నెల 5 నుంచి వైజాగ్‌లో భారీ షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నారు. ఇందులో కథానాయిక కియారాతో పాటు చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని చెబుతున్నారు. కీలక సన్నివేశాలతో కొన్ని యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘సర్కారోడు’అనే టైటిల్‌కు ఖరారు చేయబోతున్నారని సమాచారం.