మరోసారి మంచు గుప్పిట్లో అగ్రరాజ్యం.. 1500 విమానాలు రద్దు..!
America | అగ్ర రాజ్యం అమెరికా మరోసారి మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు తుపాను కురుస్తుండటంతో.. ఏకంగా 1500 విమానాలు రద్దు అయ్యాయి. పలు నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
America | అగ్ర రాజ్యం అమెరికా మరోసారి మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు తుపాను కురుస్తుండటంతో.. ఏకంగా 1500 విమానాలు రద్దు అయ్యాయి. పలు నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు 55 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, భారీ మంచు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రహదారులపై ప్రయాణించే వారు తప్పనిసరిగా తమ వెంట సేఫ్టీ కిట్‌ను ఉంచుకోవాలని నిపుణులు సూచించారు.
మిన్నేసోటా, డెన్వర్, సాల్ట్ లేక్ సిటీ, మినియాపోలిస్, సెయింట్‌పాల్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ పరిస్థితుల మధ్య 1500 విమానాలను రద్దు చేశారు. లక్షలాది నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదకరపు శీతాకాలపు తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని లాస్ ఏంజిల్స్‌లోని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒక వైపు అమెరికా పశ్చిమ, ఉత్తర ప్రాంతాలు చలికి వణికిపోతుంటే.. తూర్పు ప్రాంతాల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం గమన్హరం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

