Rain Alert | తెలంగాణకు భారీ వర్ష సూచన
Rain Alert | తెలంగాణకు భారీ వర్ష సూచన | రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం

హైదరాబాద్ : రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా మారిందని పేర్కొంది. పశ్చిమ దిశగా కదిలి.. మరింత బలపడి వాళ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గోపాల్‌పూర్‌కు 470 కిలోమీటర్ల తూర్పు – ఆగ్నేయ దిశలో, కళింగపట్నానికి తుర్పు- ఈశాన్య దిశలో 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
రాబోయే ఆరు గంటల్లో మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రా – దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశాలున్నాయి. 27న ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం పరిసర పాంత్రాల్లో తదుపరి 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది.
ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి 29 నాటికి పశ్చిమ బెంగాల్ తీరం దగ్గరకి చేరుకునే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

