health: ఫ్యాటీ లివర్ని తగ్గించే పండ్లు ఇవే
ఫ్యాటీ లివర్ సమస్య తగ్గడానికి ఇవి తినాలి
శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరగడానికి లివర్ (కాలేయం) చాలా అవసరం. అయితే, కొందరిలో లివర్‌లో కొవ్వు చేరడం వల్ల ఫ్యాటీ లివర్ అనే డిసీజ్ వస్తుంది. దానివల్ల లివర్ పని తీరు దెబ్బతినడమే కాకుండా లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్, ఒబెసిటీతో పాటు జంక్‌ఫుడ్ వంటివి ఈ సమ్యను పెంచుతాయి. ఈ డిసీజ్ నుంచి తొందరగా కోలుకునేందుకు, ఈ సమస్య రాకుండా జాగ్రత్తపడేందుకు పండ్లు, కూరగాయలతో పాటు ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలని సూచిస్తున్నారు డైటీషియన్లు. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడేసే పండ్లు ఏంటంటే…
ద్రాక్షః వీటిలో ఫ్యాటీ లివర్ సమస్యని తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ద్రాక్షలోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు పదార్ధాల్ని బయటకు పంపిస్తాయి. లివర్‌లో ఫ్యాట్ చేరకుండా చూస్తాయి. దాంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
అవకాడోః ఇందులో హై డెన్సిటీ లిపోప్రొటీన్ (హెచ్‌డిఎల్) అనే మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది లివర్‌లో చేరిన లో డెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్డిఎల్) అనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అవకాడోలోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని లిపిడ్స్‌ని కంట్రోల్లో ఉంచుతాయి. ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నవాళ్లు అవకాడో తింటే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడతారు.
బ్లూ బెర్రీలుః వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి లివర్ని ఆరోగ్యంగా చేస్తాయి. డయాబెటిస్ బారి నుంచి కాపాడతాయి కూడా. బ్లూ బెర్రీ పండ్లని రోజూ తింటే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి తొందరగా కోలుకోవచ్చు.
యాపిల్ః రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం రాదంటారు. ఇందులోని ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండులోని ఫైబర్ లివర్‌లోని అదనపు ఫ్యాట్‌ని తొలగిస్తుంది.
అరటిపండుః ఈ పండులో విటమిన్ బి6, విటమిన్-సి, ఎ ఉంటాయి. ఇవి లివర్‌లోని ఫ్యాట్‌ని తగ్గించడంలో సాయపడతాయి. అందుకని ఈ సమస్య ఉన్నవాళ్లు రెగ్యులర్‌గా అరటిపండు తినాలి.
నిమ్మరసంః ఇందులోని విటమిన్-సి, విటమిన్-ఎ వంటివి ఇమ్యూనిటీని పెంచుతాయి. అంతేకాదు లివర్‌లోని చెడు కొలెస్ట్రాల్‌ని తొలగిస్తాయి. రెగ్యులర్‌గా నిమ్మరసం తాగితే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

