కోల్‌కతా: బౌలింగ్ చేయలేనప్పుడు హార్దిక్ పాండ్యాను ఆల్‌రౌండర్‌గా పిలవొచ్చా? అని భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ సందేహం వ్యక్తం చేశాడు. ఆల్‌రౌండర్ అంటే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయాలి అని గుర్తు చేశాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ గాయం నుంచి కోలుకున్న పాండ్యాను బౌలింగ్ చేయనివ్వండి. పాండ్యా భారత్‌కు విలువైన ఆటగాడు. ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సింది ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తేనే ఆల్‌రౌండర్‌గా పిలవొచ్చు’ అని తెలిపాడు. హెడ్ కోచ్‌గా నియమితుడైన రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించాడు.
ద్రవిడ్ చాలా మంచి వ్యక్తి.. మంచి క్రికెటర్ కూడా. క్రికెటర్‌గా కన్నా కోచ్‌గా విజయవంతం అవుతాడు. ఒక మ్యాచ్‌తోనే అతడిని అంచనా చేయలేం. కొంత సమయం కావాలి. అతడు గొప్పగా చేయగలడు. మనం సానుకూల దృక్పథంతో ఉండాలి. మీ కోణంలో నేను క్రికెట్‌ను చూడను. కేవలం ఎంజాయ్ చేసేందుకు మాత్రమే చూస్తా. అశ్విన్, రవీంద్ర జడేజా నాకు ఇష్టమైన ఆల్‌రౌండర్లు. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ శతకం సాధించాడంటే మ్యాచ్ సరైన కోణంలోనే వెళ్తుందని భావించాలి. శ్రేయస్ లాంటివాళ్లు కావాలి. దేశం తరఫున ఆడేందుకు అయ్యర్ నాలుగైందేండ్ల వరకు ఎదురుచూశాడు. ఆఖరికి దొరికిన అవకాశంలో తనేంటో నిరూపించాడు’ అని తెలిపాడు.