అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం

పట్నా: బీహార్ మంత్రి ముఖేశ్ సాహ్నీ ఓ ప్రభుత్వ కార్యక్రమానికి తనకు బదులుగా తన సోదరుడిని పంపడం ఆ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గిరాజేసింది. ఈ ఘటనపై బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముఖేశ్ సాహ్నీతో వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశాయి. అంతేగాక మంత్రి ముఖేశ్ సాహ్నీ సోదరుడిని అరెస్ట్ చేయించాలని, ఆ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబడ్డారు.
దాంతో సీఎం నితీశ్‌కుమార్ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చారు. మంత్రి ముఖేశ్ సాహ్నీ ప్రభుత్వ కార్యక్రమానికి తనకు బదులుగా తన సోదరుడిని పంపించాడనే విషయం తెలియదని, అదే గనుక నిజమైతే షాకింగ్ అంశమని, అలాంటి ఘటనలు జరుగకూడదని, ఆ అంశాన్ని తాను పరిశీలిస్తానని ప్రతిపక్షాలకు హామీ ఇచ్చారు. తాజాగా అదే అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన సీఎం నితీశ్ అది అతను ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుకాదని, తెలియక చేశాడని చెప్పారు.
కొన్నిసార్లు ఒక వ్యక్తికి అన్ని విషయాల గురించి అవగాహన ఉండదు. ప్రభుత్వ కార్యక్రమానికి తనకు బదులుగా సోదరుడిని పంపడం తప్పు అని అతనికి వివరించాం. దాంతో అతడు తన తప్పును తెలుసుకుని ఒప్పుకున్నాడు. అతడు ఆ పని ఉద్దేశపూర్వకంగా చేయలేదు, అది తెలియక జరిగిన తప్పదం అని నితీశ్ కుమార్ చెప్పారు. కాగా, శుక్రవారం బీహార్‌లోని వైశాలి జిల్లా హాజీపూర్‌లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ఆ రాష్ట్ర మంత్రి ముఖేశ్ సాహ్నీ తనకు బదులుగా తన సోదరుడిని పంపించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

