చార్టర్డ్ ఎకౌంటెంట్స్ కోసం లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించిన హెచ్‌సీఏఎస్

హైదరాబాద్,జూలై:హైదరాబాద్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ(హెచ్‌సీఏఎస్) చార్టర్డ్ ఎకౌంటెంట్స్ నైపుణ్యాన్ని పెంచడానికి లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పూర్వ అధ్యక్షులు సీఏ ఎం దేవేందర్ రెడ్డి సీఏల కోసం ఏర్పాటుచేసిన చార్టర్డ్ ఎకౌంటెంట్స్ కోసం లెర్నింగ్ ప్లాట్ ఫామ్ పోర్టల్ ను ప్రారంభించారు. పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా తమ విజ్ఞానం పెంచుకోవడంలో సీఏలకు ఇది సహాయపడనున్నది.
ఈ వేదిక ద్వారా యువ బృందానికి తగిన మద్దతు వ్యవస్థ లభిస్తుందని సీఏ నిపుణులు అభిప్రాయపడ్డారు.నాణ్యతమైన అభ్యాస వేదికను నిర్వహించాలని,చార్టర్డ్ అకౌంటెన్సీ నైపుణ్యాభివృద్ధికి తోడ్పడటంతో పాటు ఇతర అంశాలలో వృత్తిని విస్తరిస్తూ వాణిజ్య,పరిశ్రమ,వ్యాపార రంగాలకు ప్రభావవంతంగా సేవలను అందించేలా తీర్చిదిద్దాలని హెచ్‌సీఏఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా హెచ్‌సీఏఎస్ అధ్యక్షులు సీఏ ప్రబినా కుమార్ మాట్లాడుతూ ‘‘ అవసరమైన శిక్షణ, సహాయం, మార్గనిర్దేశకత్వం అనేవి అత్యంత కీలకాంశాలు కావడంతో పాటుగా జర్నల్స్, ప్రచురణలు,విద్యా కార్యక్రమాలు,విజ్ఞాన పరిష్కారాల పోర్టల్ ద్వారా వాటిని చేరుకోగలం. ఆడిటింగ్,ఫెమా,అంతర్జాతీయ ట్యాక్సేషన్,వాల్యుయేషన్ తదితర అంశాలపై కీలకమైన కమిటీలను ఏర్పాటుచేయడం జరిగింది. ప్రొఫెషనల్స్ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

