గుడ్ న్యూస్ చెప్పిన భజ్జీ.. ఫ్యాన్స్ ఖుష్

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ..29 అక్టోబర్, 2015న గీతా భస్రా అనే బాలీవుడ్ బ్యూటీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో ఈ దంపతులకు అమ్మాయి జన్మించగా, ఇప్పుడు జూలైలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. హర్భజన్, గీతాల కూతురు హినయా హీర్ ప్లహా తాను అక్కను కాబోతున్నట్టు ప్లక్కార్డ్ పట్టుకొని ఫొటోకి ఫోజులిచ్చింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న హర్భజన్ సింగ్ త్వరలో ఐపీఎల్లో సందడి చేయనున్నాడు. కేకేఆర్ టీం తరపున ఆయన బరిలోకి దిగనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కోలీవుడ్‌లో ‘ఫ్రెండ్షిప్’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఇక హర్బజన్ భార్య గీతా భస్రా బాలీవుడ్లో ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’, ‘సెకండ్ హ్యాండ్ హాడ్సెండ్’ వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- geetha
- harbhajan singh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

