17 ఏళ్లక్రితం బతుకుదెరువుకోసం తెలంగాణకు వలసచ్చిండు..వివిధ ప్రాంతాల్లో పనిచేసిండు. భవననిర్మాణ కార్మికుడిగా స్థిరపడిండు. అయితే, విధి అతడిపై పగబట్టింది. ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయాడు. అతడిపైనే ఆధారపడ్డ ముగ్గురు బిడ్డలు, భార్య దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పుట్టెడు అప్పుల్లో కూరుకుపోయారు. అయినా వెరవలేదు..కాళ్లు లేవని కలతచెందలేదు..ఆత్మవిశ్వాసమే ఆలంబనగా తాను నమ్ముకున్న పనిబాటలోనే ముందుకెళ్తున్నాడు. భార్యతో కలిసి చకచకా సెంట్రింగ్ పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు వలసజీవి బొత్తుల నారాయణ.. ఈ దివ్యాంగుడి జీవితం మనకందరికీ స్ఫూర్తి మంత్రం..పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం రండి..