మహిళలకు నగలంటే ప్రాణం. నఖశిఖం అలంకరించుకున్నా, కొత్త డిజైన్ కనిపించగానే మనసు నిలువదు. ఎంత మక్కువ ఉన్నా.. తల మీద పాపిట బిళ్ల పెట్టుకోవచ్చు. నడుముకు వడ్డాణం చుట్టుకోవచ్చు. మరి గోళ్ల సంగతేమిటి? అవును, ఇప్పుడు గోళ్లకూ నగలొచ్చేశాయి. ముత్యాల నుంచి కెంపుల వరకూ నవరత్నాలతో గోళ్లను ముస్తాబు చేసుకోవచ్చు. వజ్రాలతోనూ నెయిల్ జువెలరీ తయారుచేస్తున్నారు. నెయిల్ ఆర్ట్‌తో విసిగిపోయినవారికి ఈ కొత్త వింత తప్పక నచ్చుతుంది.