ఇటీవల కాలంలో వాట్సాప్ వినియోగం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫోన్ కాల్స్ తగ్గిస్తూ..వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ కు వాట్సాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా వాట్సాప్ కు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా స్టేటస్ లు, డీపీలు పెట్టుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామనే కదా మీ డౌటు.
ఏం లేదండి..సెలబ్రిటీల గురించి విషయాలను తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఇపుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏం డీపీ పెట్టాడనే వార్త నెట్టింట్టో చక్కర్లు కొడుతోంది. వైల్డ్ డాగ్ ట్రైలర్ లాంఛింగ్ సందర్భంగా తన స్నేహితులు చిరంజీవి, మహేశ్‌బాబుతో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్‌ను ట్విటర్ లో షేర్ చేశాడు నాగ్. అయితే ఈ చాటింగ్ లో అందరి కన్నుమహేశ్బాబు డీపీపై పడ్డది. అంత స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా..? మహేశ్ బాబు పెట్టుకున్న డీపీ లయన్ (సింహం). ‘మహేశ్ యాక్టర్ ‘ కాంటాక్ట్ నేమ్‌తో ‘లయన్ ‘ డీపీ ఉన్న స్టిల్ ఇపుడు తెగ ట్రెండ్ అవుతుంది.
Very happy to share these Screenshots from my friends when they saw #WildDogTrailer#WildDogOnApril2nd@ahishor @MusicThaman @Deonidas @deespeak @SaiyamiKher @ActorAliReza @mayankparakh19 #PrakashSudarshan @onelifeitiz @pasha_always @MatineeEnt pic.twitter.com/cN0tEKKOHw
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 12, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.