న్యూఢిల్లీ, మార్చి 2: కొరియాకు చెందిన వాహన విక్రయ సంస్థ కియా గత నెలకుగాను 18,121 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఫిబ్రవరి 2021లో అమ్ముడైన 16,702లతో పోలిస్తే ఇది 8.5 శాతం అధికం. సంస్థ మొత్తం వాహన విక్రయాల్లో సెల్టాస్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో గత కొన్ని నెలలుగా అమ్మకాల్లో రెండింతల వృద్ధి నమోదవుతున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ సెమికండక్టర్ల కొరత ఆందోళన కలిగిస్తున్నదన్నారు.