న్యూఢిల్లీ: డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్, రెజ్లింగ్ ఆటగాడు ది గ్రేట్ ఖలీగా సుపరిచితుడైన దలీప్ సింగ్ రానా గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోదీ పనితీరును చూసి బీజేపీలో చేరుతున్నట్టు ఖలీ చెప్పారు.