ఏప్రిల్ 1 నుంచి కార్ల ఫ్రంట్ సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి!

న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కార్లలో ముందు రెండు సీట్లకు ఎయిర్‌బ్యాగులు ఏర్పాటు చేయడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఇప్పటివరకు కారును నడిపే డ్రైవర్ సీటుకు మాత్రమే ఎయిర్‌బ్యాగ్ ఉండేది. కానీ ప్రయాణికుల భద్రత మరింత బలోపేతం చేయడానికి డ్రైవర్‌తోపాటు ముందు ప్రయాణించే మరో ప్రయాణికుడి సీటుకు కూడా ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్లోనే కార్లలో ముందు రెండు సీట్లకు తప్పనిసరి చేయాలా? వద్దా? అన్న విషయమై కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అయితే, ఇప్పుడిప్పుడే డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో ముందు రెండు సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చడం వల్ల కార్ల తయారీ దారులపై భారం పెరుగుతుందని భావిస్తున్నారు.
కార్లలో ముందు రెండు సీట్లకు ఎయిర్‌బ్యాగులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర న్యాయశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు అన్ని కార్లలో డ్రైవర్ సీటుకు మాత్రమే ఎయిర్‌బ్యాగ్ ఉండేది.
అయితే, ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు గాయాల నుంచి, ప్రాణ హాని ముప్పు నుంచి ఎయిర్‌బ్యాగ్‌లు రక్షించలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్పీడ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, సీట్ బెల్ట్ రిమైండర్లు అన్ని కార్లలో స్టాండర్డ్ ఫీచర్లుగా ఉన్నాయి. కానీ లైఫ్ సేవింగ్ ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రం ఇప్పటివరకు తప్పనిసరి చేయలేదు.
ఇక నుంచి అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్తగా ఉత్పత్తి చేసే అన్ని రకాల మోడళ్ల కార్లలో ముందు రెండు సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయాలన్న నిబంధనను అమలు చేయాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే ఉత్పత్తి చేసిన కార్లలో మాత్రం జూన్ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నదని రవాణాశాఖ మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన ముసాయిదా ఇంతకుముందు నివేదిక పేర్కొన్నది.
రెండేండ్ల క్రితం కార్ల డ్రైవర్ సీటుకు ఎయిర్‌బ్యాగ్ అమర్చడం తప్పనిసరి చేసింది కేంద్రం. ఈ నిర్ణయం 2019 జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- airbags
- Cars
- front seats
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

