బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..‘పుష్ప’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

అభిమాన హీరోలకు సంబంధించిన సినిమా అప్ డేట్స్ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా వేచి చూస్తుంటారు. అందులోనూ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా బన్నీ చేతిలో ఉన్నాయి. వరుస సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చి వాటికి డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉన్నాడు బన్నీ. ఈ క్రమంలోనే పుష్ప సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ కు కూడా ఈ విషయంలో ఇప్పటికే సూచనలు కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. దానికి తగ్గట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తున్నాడు సుకుమార్.
మొన్నటి వరకు ఈయన ఉప్పెన సినిమాతో బిజీగా ఉన్నాడు. శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కూతురు ఓణి ఫంక్షన్ కూడా చేసాడు సుకుమార్. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా తన వ్యక్తిగత పనులు చేసుకుంటున్నాడు సుకుమార్. పుష్ప ఆగస్ట్ 13న విడుదల తేదీ కన్ఫర్మ్ చేయడంతో కాస్త కష్టమైనా కూడా వేగంగానే సినిమాను పూర్తి చేస్తున్నాడు. తన కెరీర్ లో ఎన్నడూ లేనంత ఫాస్టుగా ఈ సినిమా షూట్ చేస్తున్నాడు సుకుమార్. ఇక టీజర్ విషయానికి వస్తే ఏప్రిల్ 8న విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. అందుకే బర్త్ డే గిఫ్టుగా అభిమానులకు పుష్ప టీజర్ ను ఇవ్వడానికి చూస్తున్నారు.
గతేడాది ఏప్రిల్ 8న పుష్ప ఫస్ట్ లుక్ విడుదలైంది. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ ఏడాదికి టీజర్ విడుదల చేయబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రంపచోడవరంలో రెండు షెడ్యూల్స్..హైదరాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసాడు సుకుమార్. దాంతో షూటింగ్ దాదాపు సగం పూర్తయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పుష్ప చిత్ర బృందం తమిళనాడులోని టెన్కాశిలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉంది. అక్కడే ఓ పల్లెటూరిలో హీరో కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. మరోవైపు నారా రోహిత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

