మరింత తగ్గిన పసిడి ధర

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు మరింత తగ్గాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.291 తగ్గి రూ.44,059కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,350 వద్ద ముగిసింది. గత ట్రేడ్లో అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలకు డిమాండ్ లేకపోవడమే దేశీయంగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక, వెండి ధరలు కూడా ఇవాళ దిగొచ్చాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,096 తగ్గి రూ.65,958కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.67,054 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,707 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.67 అమెరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

