గోల్కొండ కీర్తి కిరీటం..కుతుబ్షాహీ టూంబ్స్

దక్కన్ చారిత్రక వారసత్వమైన గోల్కొండ కీర్తి కిరీటంలోని కలికితురాయి కుతుబ్షాహీ టూంబ్స్. మన చరిత్రకు సాక్షిగా నిలిచిన ఎత్తయిన గోపురాలతో అలరారే ఈ ప్రాంగణం ఇప్పుడు మరింత అందంగా దర్శనమిస్తున్నది. నాటిచరిత్ర, సంస్కృతి, గొప్పదనానికి ఆనవాళ్లుగా నిలిచే టూంబ్స్ రాష్ట్ర పురావస్తు శాఖ, ఆగాఖాన్ ట్రస్ట్ ఆఫ్ కల్చర్ చొరవతో కొత్త అందాలను సంతరించు కున్నాయి.
ప్రపంచంలోని సమాధి ప్రదేశాలన్నింటి కంటే కుతుబ్ షాహీ సమాధులే అతిపెద్ద ప్రదేశంగా గుర్తింపు పొందాయి. గోల్కొండను చూసేందుకు వచ్చిన పర్యాటకులెవరైనా తప్పక సందర్శించాల్సిన ప్రదేశమిది. ఇక్కడి కుతుబ్షాహీ రాజుల సమాధులు, మసీదులు, తారామతి, హుస్సేన్ షావలి సమాధులతో పాటు ఇతర నిర్మాణాలు పర్యాటకుల్ని మురిపిస్తాయి. ప్రపంచ వారసత్వాన్ని కాపాడుకునేందుకు పురావస్తు శాఖ, ఆగాఖాన్ ట్రస్ట్ ఆఫ్ కల్చర్లు కలిసి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ ప్రాజెక్టును చేపట్టాయి. టూంబ్స్ పరిరక్షణ కోసం శాస్త్రీయ పద్ధతిలో కృషి చేశారు. టూంబ్స్, మసీదులు, మార్చురీ బాత్, బడీ బౌలి నిర్మాణాలను పునరుద్ధరిస్తూ వీటి పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. అతిపెద్దదైన మెట్లబావి బడీ బౌలి. 400 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ బావి నీటి నిల్వ సామర్థ్యం 10 లక్షల లీటర్లు. బావికి రక్షణగా నిర్మించిన రాతి గోడ దెబ్బతినడంతో పాటు నిర్వహణ లోపం వల్ల బావిలోని నీళ్లు నాచుతో నిండిపోయాయి. 2013లో వచ్చిన వరదలతో బడీ బౌలిలోని కొన్ని నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఈ బడీబౌలిని కూడా చక్కగా పునరుద్ధరించారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా 500 ఏళ్ల క్రితం నాటి ముడి పదార్థాలతోనే వన్నెలద్దారు. బెంగాలీ వృత్తి నిపుణులు అంగుళమంగుళమూ ప్రత్యేకత ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. చరిత్ర, సంస్కృతికి సంబంధించిన మానవీయ విలువలు వ్యక్తమవుతూ, ప్రపంచంలోనే ప్రకృతిలో కలిసిపోయేంత అత్యంత అద్భుతమైన నిర్మాణ సొగసును సొంతం చేసుకున్న ఈ సమాధులను వీక్షించడానికి అన్ని కాలాలూ అనుకూలమే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

