న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కరోనా వేళ మరో గుడ్ న్యూస్. వ్యాక్సిన్లకు తోడుగా నాసల్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవారికోసం ముక్కు ద్వారా అందించే స్ప్రేను ముంబైకి చెందిన గ్లెన్మార్క్, కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ సనోటైజ్ రిసెర్చ్ సంస్థలు ‘ఫ్యాబీస్ప్రే’ పేరుతో బుధవారం మార్కెట్లోకి విడుదల చేశాయి. నైట్రిక్ ఆక్సైడ్ కలిగిన ఈ స్ప్రేకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ముక్కులో ఉండే కరోనా వైరస్ను ఈ స్ప్రే నాశనం చేస్తుందని, 24 గంటల్లో వైరల్ లోడ్లో 94%, 48 గంటల్లో 99% వైరస్ను తగ్గిస్తుందని గ్లెన్మార్క్ కంపెనీ వెల్లడించింది.