అద్దాల వంతెనపై ప్రమాదం.. అంచున వేలాడిన టూరిస్టు

బీజింగ్: అడుగున అద్దాలు వేసిన వంతెనపై విహారం బాగానే ఉంటుంది. చైనాలో ఇలాంటి వంతెనలు చాలానే ఉన్నాయి. కానీ ఒక్క పలక జారినా ప్రాణాలకు ముప్పే. ఓ టూరిస్టు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. చైనాలోని లాంగ్‌జింగ్ నగరంలోని పియాన్ కొండపై 100 మీటర్ల ఎత్తున ఉండే అద్దాల వంతెన ఓ టూరిస్టు స్పాట్. కాళ్ల కింద పారదర్శకంగా ఉండే అద్దం లోనుంచి కిందకు చూడడం సరదా. 150 కిలోమీటర్ వేగంతో వీచిన ఈదురు గాలులకు కొన్ని గాజు పలకలు ముక్కలై ఎగిరిపోయాయి. వాటి మీదుగా నడుస్తున్న టూరిస్టు ఒక్కసారిగా కిందకు పడబోయాడు. అంతలోనే తమాయించుకుని రెయిలింగ్‌ను పట్టుకున్నాడు. ముందుకు వెళ్లలేక.. వెనుకకు రాలేక అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. అగ్నిమాపకదళం, పోలీసులు, టూరిజం సిబ్బంది అంతా కలిసి అతడిని సురక్షితంగా తీసుకురావడానికి అరగంట పైనే పట్టింది. చైనా మైక్రోబ్లాగింగ్ సైటు “వెయిబో”లో ఈ వార్తను పోస్టే చేస్తే 58 లక్షల మంది చూశారు. సదరు టూరిస్టుకు ఏమీ కాలేదు. కానీ పరీక్షలు, కౌన్సెలింగ్ నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- broken
- china
- glass bridge
- nightmare
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

