Ganesh Bigala | లండన్: బ్రిటిష్ పార్లమెంట్లో LORD(MP) గా ఎంపికైన తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజును నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే, గణేశ్ బిగాల, బీఆర్ఎస్ పార్టీ NRI గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటిష్ పార్లమెంట్లో LORD(MP) హోదా దక్కించుకోవడం అరుదైన విషయమని, ఇది తెలుగు వారందరికీ గర్వకారణమని వారు కొనియాడారు. ఇటీవల ఈ బాధ్యతలు స్వీకరించిన సిద్దిపేటకు చెందిన ఉదయ్ నాగరాజును కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వారితో బీఆర్ఎస్ యూకే (BRS, UK) అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఉన్నారు.