ముంబై: బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇవాళ ఓ తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. తన ఇన్స్టా పోస్టులో ఆమె తల్లికాబోతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలియాకు కంగ్రాట్స్ మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఓ ప్రత్యేక వ్యక్తి నుంచి కూడా ఆలియా విషెస్ మెసేజ్ అందింది. హాలీవుడ్ మూవీలో నటిస్తున్న తోటి నటి గాల్ గాడెట్ కంగ్రాట్స్ చెబుతూ ఆలియాకు మెసేజ్ చేసింది. వండర్ వుమెన్ చిత్రంతో గాల్ గాడెట్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఆలియా, రణ్బీర్ పెళ్లి సమయంలోనూ గాల్ గాడెట్ తన ఇన్స్టాలో ఆ జంటకు ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పింది.