హైదరాబాద్, సెప్టెంబర్22 (నమస్తే తెలంగాణ): గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సీఎస్ఈ 2027 కోసం ఇంటిగ్రేటేడ్ శిక్షణ ఉచితంగా అందివ్వనున్నారు. దరఖాస్తుల గడువు నేటి(బుధవారం)తో ముగియనున్నది. గిరిజన సంక్షేమశాఖ అధికారులు మంగళవారం ప్రకటనలో వెల్లడించారు. శ్రీరామ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థ సహకారంతో రాజేంద్రనగర్ ఐఏఎస్ ఎస్టీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, మెరిట్ టెస్టు ద్వారా ఎంపిక ఉంటుందని తెలిపారు. వివరాలకు https://welfare.sriramsias.com వెబ్సైట్ సందర్శించాలని, 91210 87421, 62817 66534 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.