‘వృద్ధుడి ఆగడాలు వేగలేక..అశ్లీల వీడియోలు చూపుతూ కడతేర్చింది’

నాగపూర్ : విడాకులు ఇచ్చి వేరొకరిని వివాహం చేసుకున్నా లైంగిక సంబంధం కొనసాగించాలని వేధిస్తున్న 65 ఏండ్ల మాజీ భర్తను కత్తిపోట్లతో కడతేర్చిన మహిళ ఉదంతం నాగపూర్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు స్వాతి మాలిక్ అలియాస్ స్వాతి శర్మ మాజీ భర్త లక్ష్మణ్ మాలిక్‌ను నాగపూర్‌లోని గణేష్‌పేట్ కాలనీలోని ఆయన ఇంట్లో మార్చి 8న హత్య చేసింది. మధ్యవయస్కురాలైన నిందితురాలు లక్ష్మణ్ జీవితంలోకి వచ్చిన ఐదుగురు మహిళల్లో నాలుగో భార్య. స్వాతి బోటిక్ నడుపుతుండగా లక్ష్మణ్ ఈఐఎస్సీ దవాఖానలో పనిచేస్తూ పదేండ్ల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. నాలుగో భార్య స్వాతి నిర్వహించే బొటిక్‌లో పనిచేసే మైనర్ బాలికపై లక్ష్మణ్ కన్నేయడంతో 2018లో వీరు విడిపోయారు.
ఆపై స్వాతి వేరొకరిని వివాహం చేసుకుంది. మరో వ్యక్తితో ఆమె వైవాహిక జీవితం గడుపుతున్నా తనతో లైంగిక సంబంధం నెరపాలని స్వాతిపై లక్ష్మణ్ ఒత్తిడి తెచ్చేవాడు. తన పెన్షన్‌ను స్వాతి విత్‌డ్రా చేస్తుండటంతో ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నించాడు. దీంతో లక్ష్మణ్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న స్వాతి ఏకంగా ఆయన ఇంటికి వెళ్లింది. అశ్లీల వీడియోలు చూపుతూ లక్ష్మణ్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి తాళ్లతో బంధించింది. ఆపై కత్తితో కసితీరా పొడుస్తూ చనిపోయాడని నిర్దారించుకున్న అనంతరం ఘటనా స్ధలం నుంచి పారిపోయింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు 180 మంది అనుమానితులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెపుతూ దొరికిపోయిన స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. కాగా లక్ష్మణ్ రెండో భార్య, ఆమె సహచరురాలు కలిసి తనను కుర్చీలో కట్టేసి నిర్బంధించారని 2016లో స్వాతి అంబజరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని స్ధానిక పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

