గుజరాత్లో నాలుగు ఉడాన్ సర్వీసుల నిలిపివేత

గాంధీనగర్ : కేంద్ర ప్రభుత్వ పథకం ఉడాన్ కింద గత రెండేళ్లలో గుజరాత్లో మొత్తం 19 విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తాజాగా వీటిలో నాలుగు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభకు తెలిపింది. రాష్ట్ర పౌర విమానయానశాఖ మంత్రి భూపేంద్రసింగ్ చుదాసమ లిఖితపూర్వంగా సభకు ఈ విషయాన్ని తెలియజేశారు.
31 డిసెంబర్,2020 వరకు గుజరాత్లో మొత్తం 19 విమాన సర్వీసులు ప్రారంభించబడ్డాయి. వాటిలో నాలుగింటి సేవలను నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్ జామ్నగర్, డయు, ముంద్రా, భావ్నగర్లకు అనుసంధానించే విమాన సర్వీసులు నిలిపివేయబడినట్లు పేర్కొన్నారు. ఆ మార్గంలో ఆర్థికంగా లాభదాయకం కానందువల్లే సదరు సంస్థ ఆ మార్గాల్లో సేవలను నిలిపివేసినట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

