మంచిర్యాలలో దారుణం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

మంచిర్యాల : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కాసిపేట మండలం మల్కపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రమేశ్, పద్మ దంపతులు గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో గదిలో వారి కొడుకు అక్షయ్ (17), కూతురు సౌమ్య (19) మృతదేహాలున్నాయి. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే, కూతురు సౌమ్య ఇటీవల అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. సౌమ్య అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో జిల్లాలో సంచలనంగా మారగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

