ఏపీలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి
ఏపీలోని ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువకముందే తాజాగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇంటికి నిప్పుపెట్టారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువకముందే తాజాగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇంటికి నిప్పుపెట్టారు. జోగి రమేశ్ నివాసంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సమయంలో జోగి రమేశ్ తండ్రి, ఆయన సతీమణి, పిల్లలు ఇంట్లోనే ఉండటం గమనార్హం.
ఘటన సమయంలో జోగి రమేశ్ తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నివాసంలో ఉన్నారు. తిరుపతిలో జోగి రమేశ్ స్పందిస్తూ తన కుటుంబం హత్యకు కుట్ర జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దాడి విషయం తెలుసుకున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆయన్ను ఫోన్లో పరామర్శించారు. దాడికి గురైన విడదల రజని, బ్రహ్మనాయుడిని సైతం జగన్ ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

