Dhoni Bike Collection: వామ్మో.. ఇదేం పిచ్చి.. ధోనీ బైక్ కలెక్షన్ హౌజ్ చూసి స్టన్ అయిన మాజీ క్రికెటర్లు.. వీడియో
Dhoni bike collection: రాంచీలో ధోనీ ఓ బైక్ గరాజ్‌నే కట్టేశాడు. మిస్టర్ కూల్ బైక్ కలెక్షన్ చూసిన మాజీ క్రికెటర్లు బిత్తెరపోతున్నారు. ఇంత పిచ్చేంటి అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాంచీ ఫామౌజ్‌లో ఉన్న ధోనీ బైక్ హౌజ్‌కు మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, సునీశ్ జోషీలు ఆ కలెక్షన్ చూసి స్టన్ అయ్యారు.
రాంచీ: మాజీ క్రికెటర్ ధోనీకి బైక్‌లంటే పిచ్చి. అతని వద్ద ఎన్ని బైక్‌లు ఉన్నాయో చెప్పలేం. ఏ కంపెనీ బైక్ లేదో కూడా చెప్పడం కష్టమే. స్వంత ఊరు రాంచీలో ధోనీ ఓ బైక్ గరాజ్‌నే కట్టేశాడు. మిస్టర్ కూల్ బైక్ కలెక్షన్(Dhoni Bike Collection) చూసిన మాజీ క్రికెటర్లు బిత్తెరపోతున్నారు. ఇంత పిచ్చేంటి అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాంచీ ఫామౌజ్‌లో ఉన్న ధోనీ బైక్ హౌజ్‌కు మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, సునీశ్ జోషీలు ఆ కలెక్షన్ చూసి స్టన్ అయ్యారు.
మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ ఆ గరాజ్‌కు చెందిన వీడియోను పోస్టు చేశారు. ధోనీకి బైక్‌లంటే ఇష్టమన్న విషయం తెలుసు కానీ, దాదాపు వందకు పైగా బైక్‌లు అతని వద్ద ఉన్నట్లు ఆ వీడియో చూస్తే కానీ తెలియడం లేదు. ధోనీ బైక్ హౌజ్‌ను చూసిన వెంకటేశ్ ప్రసాద్ తన మనసులోని మాటను ఆపుకోలేకపోయారు. ఒక వ్యక్తిలో ఎంత క్రేజీ ప్యాషన్ ఉంటుందో చూశానని ప్రసాద్ అన్నాడు. ఏంటా కలెక్షన్, ధోనీ ఓ గొప్ప సాధకుడు, ఓ అసాధారణ వ్యక్తి అంటూ వెంకటేశ్ తన ట్వీట్లో తెలిపాడు.
One of the craziest passion i have seen in a person. What a collection and what a man MSD is . A great achiever and a even more incredible person. This is a glimpse of his collection of bikes and cars in his Ranchi house.
Just blown away by the man and his passion @msdhoni pic.twitter.com/avtYwVNNOz— Venkatesh Prasad (@venkateshprasad) July 17, 2023
ధోనీ భార్య సాక్షీ .. ఫామౌజ్కు వచ్చిన అతిథుల్ని ఇంటర్వ్యూ చేసింది. రాంచీలో ఎలా ఫీలవుతున్నారని వాళ్లను అడిగింది. దానికి ప్రసాద్ సమాధానం ఇస్తూ అమేజింగ్‌గా ఉందన్నాడు. రాంచీ రావడం ఇది తొలిసారి కాదు అని, నాలుగోసారి వచ్చానన్నాడు. కానీ ధోనీ బైక్ కలెక్షన్ సెంటర్ మాత్రం క్రేజీగా ఉందన్నాడు. మరో మాజీ క్రికెటర్ జోషీ మాట్లాడుతూ.. అసలు ఈ సెటప్ గురించి వివరించలేమన్నారు.
ఎంత పిచ్చి ఉంటే ఇన్ని బైక్‌లు ఉంటాయని ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇవన్నీచూస్తుంటే ఇక్కడో బైక్ షోరూమ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. విపరీతమైన మోజు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదన్నాడు. వీడియో తీసిన సాక్షీ కూడా ధోనీని ఓ ప్రశ్న వేసింది. ఎందుకు మహీ, ఈ బైక్ కలెక్షన్ ఎందుకోసం అని అడిగిందామె. దానికి మాజీ కెప్టెన్ సమాధానం ఇస్తూ.. ఎందుకంటే నువ్వు అన్నీ తీసుకున్నావు, కానీ నాకంటూ ఒకటి స్వంతంగా ఉండాలి కదా.. ఈ ఒక్క బైక్ హౌజ్‌కు మాత్రమే నువ్వు అంగీకరించినట్లు చెప్పాడు.
ధోనీ గరాజ్లో రాజ్‌దూత్, కవాసకి నింజా, హర్లే డేవిడ్సన్, టీవీఎస్ రోనిన్ క్రూయిజర్ లాంటి బైక్‌లు ఉన్ఆనయి. ఇది తన భర్త ఫెవరేట్ బొమ్మలని గతంలో ఓ సారి సాక్షీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

