Union Budget | బడ్జెట్లో మదుపరులకు గట్టి దెబ్బ.. మూలధన లాభాల పన్నుల పెంపు
ఈసారి బడ్జెట్లో మదుపరులకు గట్టి షాక్ ఇచ్చారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
Union Budget | న్యూఢిల్లీ, జూలై 23: ఈసారి బడ్జెట్లో మదుపరులకు గట్టి షాక్ ఇచ్చారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మూలధన లాభాలు, ట్రేడింగ్ కార్యకలాపాలు ప్రభావితమయ్యేలా పలు కీలక పన్నులను పెంచారు.
దీర్ఘకాల మూలధన లాభాల పన్ను
అన్ని ఆర్థిక, ఆర్థికేతర ఆస్తులపై లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ లేదా దీర్ఘకాల మూలధన లాభాలు) పన్ను రేటును 12.5 శాతానికి పెంచారు. అంతకుముందు 10 శాతంగానే ఉండేది. దీంతో గతంలో చెల్లించిన ఎల్టీసీజీ ట్యాక్స్‌పై మరో 25 శాతం అదనంగా ఇకపై ఇన్వెస్టర్లు చెల్లించాల్సి వస్తున్నది. అయితే నిర్దేశిత ఆర్థిక ఆస్తులపై మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల కోసం మూలధన లాభాల మినహాయింపును ఏటా రూ.1.25 లక్షలకు పెంచాలనే యోచన ఉన్నట్టు మంత్రి చెప్పారు.
స్వల్పకాల మూలధన లాభాల పన్ను
కొన్ని ఆర్థిక ఆస్తుల నుంచి అందుకునే షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ లేదా స్వల్పకాల మూలధన లాభాలు) పన్ను రేటును 20 శాతానికి పెంచుతున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. ఇంతకుముందు ఇది 15 శాతంగానే ఉండేది.
ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ భారం
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌ను భారం చేస్తూ సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ను కేంద్రం పెంచేసింది. రిస్క్‌తో కూడిన ఈ పెట్టుబడులకు ఈక్విటీ, ఇండెక్స్ ట్రేడర్లు తదితర రిటైల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉండేలా ఎస్టీటీని రెట్టింపు చేసింది. 0.02 శాతంగా ప్రకటించింది. ఇంతకుముందు 0.01 శాతమే. పెరిగిన రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
బైబ్యాక్ షేర్లపై..
షేర్ బైబ్యాక్‌కు చెల్లించే నగదును డివిడెండ్గానే చూడాల్సి వస్తుందని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 1 నుంచి దానిపై పన్ను పడుతుందని తేల్చిచెప్పారు. షేర్లను అమ్ముకున్నవారికి వచ్చే మొత్తాలు ఆదాయ పన్ను సహితం అన్నారు. కాబట్టి వారు సదరు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.
టీడీఎస్ తప్పదు
స్థిరాస్తి విలువ రూ.50 లక్షలు, ఆపై ఉంటే దాని అమ్మకంపై 1 శాతం ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. అమ్మకందారులు లేదా కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నప్పటికీ టీడీఎస్ మినహాయింపు తప్పనిసరి అని చెప్పారు. ఇదిలావుంటే సంవత్సరానికిపైగా ఉన్న లిస్టింగ్ ఫైనాన్షియల్ అసెట్స్‌ను దీర్ఘకాలంగానే భావిస్తారు. అన్ లిస్టింగ్ ఆర్థిక, ఆర్థికేతర ఆస్తులు రెండేండ్లకుపైగా ఉంటే కూడా ఇదే వర్తిస్తుంది. అన్‌లిస్టెడ్ బాండ్లు, డెట్ మ్యూచువల్ ఫండ్లు, మార్కెట్ ఆధారిత డిబెంచర్లు, ఇతర డిబెంచర్లపైనా మూలధన లాభాల పన్నును చెల్లించాల్సిందే.
సార్వత్రిక బడ్జెట్లో ఎంఎస్ఎంఈతోపాటు వ్యవసాయం రంగానికి అధిక నిధులు కేటాయించారు. పారిశ్రామిక క్లస్టర్లలో సిడ్బీ శాఖను ఏర్పాటు చేయనుండటంతో రుణాలు తీసుకోవడం మరింత సులభతరం కానున్నది. విద్యా, ఉద్యోగ కల్పన, ప్రతిభను ప్రోత్సహించడానికి భారీ స్థాయిలో నిధులను కేటాయించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ముద్రా రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు.
– సాయి డీ ప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్
ఉద్యోగ కల్పన, ప్రతిభను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. బంగారం, వెండిపై కస్టమ్ సుంకాన్ని తగ్గించడంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు.
– రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్
పీఎంఏఐతో రుణాలకు డిమాండ్ పెరగనున్నది. ద్రవ్యోల్బణాన్ని 4.9 శాతానికి కట్టడి చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానున్నది. క్రెడిట్ గ్యారెంటీ స్కీంతో చిన్న వ్యాపార సంస్థలకు ఊతమిచ్చినట్లు కానున్నది. నిధులు లేక సతమతమవుతున్న సంస్థలకు రుణాలు లభించనున్నాయి.
– దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్
స్టార్టప్‌లపై ఏంజిల్ ట్యాక్స్ ఎత్తివేయడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం మరింత పెరగనున్నది. దీంతో మరింత మంది పెట్టుబడిదారులు స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి. స్పేస్ రంగానికి ఊతమివ్వడానికి రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
– ఎం శ్రీనివాస్ రావు, టీ-హబ్ సీఈవో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

