మెటల్ గ్యాస్ సిలిండర్ అంటేనే గుండె దడుక్కుమంటుంది. దీన్ని మార్చేటప్పుడు..వాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా లేకుంటే వంటింటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే, ఇకపై ఆ టెన్షన్ లేదు. మార్కెట్లోకి అతి తేలికైన, బుల్లెట్ ప్రూఫ్ బాడీగల ఫైబర్ సిలిండర్ వచ్చేసింది. దీన్ని అటూ ఇటూ మోసుకెళ్లడం ఈజీ. అలాగే, గ్యాస్ ప్రమాదాలు జరుగుతాయన్న టెన్షన్ కూడా ఉండదు. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది..? దీని ధర ఎంత? ఎలా పొందాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.