వేసవిలో వినోదాల హంగామా
వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకుడు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని రెండో సింగిల్ ‘ఊ..ఆ..ఆహా..ఆహా..’ అనే గీతాన్ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిత్ర ప్రధాన తారాగణమంతా రోప్ పుల్లింగ్ ఆడుతూ కనిపించారు. ‘ఆద్యంతం హాస్య ప్రధానంగా సాగే చిత్రమిది. డబ్బు వల్ల వచ్చే సమస్యల చుట్టూ కథ నడుస్తుంది. ఈ క్రమంలో పండే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది. మండువేసవిలో వినోదాల జల్లులతో సేద తీరుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. తమన్నా, మెహరీన్, సోనాల్‌చౌహాన్, రాజేంద్రప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- devisriprasad
- dilraju
- shirish
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

