Australian Open | ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్
నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో అలెక్స్ డి మినౌర్ (ఆస్ట్రేలియా)పై 6-2 6-1 6-2తో విజయం సాధించాడు. సెమీస్ బెర్తు కోసం అతను రష్యాకు చెందిన ఆడ్రే రుబ్లెవ్తో తలపడనున్నాడు.
Australian Open : మాజీ వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డి మినౌర్ను చిత్తు చేశాడు. మూడు సెట్లలో ఆధిపత్యం చెలాయించి 6-2 6-1 6-2తో విజయం సాధించాడు. ఆసీస్ గడ్డపై జకోవిచ్‌కు ఇది వరుసగా 38వ విజయం. ‘అన్ని సెట్లు గెలవాలనుకున్నా. ఎందుకంటే గత నాలుగైదు మ్యాచ్‌ల్లో తక్కువ పాయింట్లతో గట్టెక్కాను. అందుకని బ్రేక్ టైమ్ తర్వాత దూకుడుగా ఆడాను. మ్యాచ్ తొందరగా ముగిసినందుకు నేను సారీ చెప్పను. మీరు సుదీర్ఘ మ్యాచ్ చూడలేకపోయారు’ అని మ్యాచ్ అనంతరం జకోవిచ్ అభిమానులతో అన్నాడు.
గత ఏడాది కరోనా వ్యాక్సిన్ వేసుకోనందుకు జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఈసారి బరిలోకి దిగిన అతను విజయయాత్ర కొనసాగిస్తున్నాడు. పదో ఆస్ట్రేలియన్ ట్రోఫీపై కన్నేసిన అతను క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్ బెర్తు కోసం అతను రష్యాకు చెందిన ఆడ్రే రుబ్లెవ్తో తలపడనున్నాడు. ప్రస్తుతం జకోవిచ్ ఖాతాలో 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

