రఫాను ఖాళీ చేయండి
గాజా స్ట్రిప్‌లోని రఫా నగరం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సుమారు ఒక లక్ష మంది ప్రజలను ఆదేశించింది. దీంతో క్షేత్ర స్థాయిలో యుద్ధం సమీపంలోనే ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
- పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ఆదేశం
- నగరంపై సైన్యం దాడులు మొదలు
జెరూసలెం: గాజా స్ట్రిప్‌లోని రఫా నగరం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సుమారు ఒక లక్ష మంది ప్రజలను ఆదేశించింది. దీంతో క్షేత్ర స్థాయిలో యుద్ధం సమీపంలోనే ఉందనే సంకేతాలు వస్తున్నాయి. రఫాపై దాడి చేస్తే కాల్పుల విరమణ ఒప్పందం కోసం జరుగుతున్న ప్రయత్నాలు పట్టాలు తప్పుతాయని హమాస్, ఖతార్ తెలిపాయి. ఈ ఒప్పందం కోసం ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హమాస్‌కు ప్రాబల్యం గల ప్రాంతాల్లో రఫా ఒకటి అని, ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్‌ను మట్టి కరిపించాలంటే ఇక్కడ క్షేత్ర స్థాయిలో యుద్ధం చేయవలసిన అవసరం ఉందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. సోమవారం రఫాపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు స్థానికులు తెలిపారు. కాగా, ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నడవ్ షోషని మాట్లాడుతూ పరిమిత స్థాయిలో ఆపరేషన్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
కాల్పుల విరమణకు హమాస్ అంగీకారం
గాజాలో ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధానికి తెర దించేందుకు హమాస్ అంగీకరించింది. ఈ యుద్ధంలో కాల్పుల విరమణకు ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులు చేసిన ప్రతిపాదనలను అంగీకరించినట్లు హమాస్ సోమవారం ప్రకటించింది. రఫా నగరం నుంచి దాదాపు లక్ష మంది వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిన తరుణంలో హమాస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఇజ్రాయెల్ నుంచి స్పందన రాలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Gaza strip
- Israeli army
- Rafa
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

