మాస్కో, ఫిబ్రవరి 13: ఎస్టోనియా ప్రధానమంత్రి కాజా కల్లాస్‌ను రష్యా వాంటెడ్ లిస్టులో చేర్చింది. నేరారోపణలకు సంబంధించి అంతర్గత మంత్రిశాఖ కోరిన వ్యక్తుల రిజిస్టర్లో కల్లాస్ పేరు మంగళవారం కనిపించింది. సోవియట్ కాలం నాటి రెండో ప్రపంచ యుద్ధ స్మారకాలను తొలగించేందుకు కల్లాస్ ప్రయత్నాల నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకున్నది.
అంతర్గత మంత్రిత్వశాఖ ఒక విదేశీ నాయకుడి పేరు వాంటెడ్ లిస్టులో పెట్టడం ఇదే తొలిసారి. కల్లాస్ ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు. కాగా, ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కల్లాస్ పేరును వాంటెడ్ లిస్టు పెట్టడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎస్టోనియా.. నాటో సభ్యదేశంగా ఉన్న సంగతి తెలిసిందే.