హ్యూస్టన్‌లో తప్పించుకున్న బెంగాల్ టైగర్ దొరికింది

హ్యూస్టన్: యజమాని ఇంటి నుంచి తప్పించుకుని, హ్యూస్టన్ వీధుల్లో పరుగులు తీసి జనాలను దడుసుకునేలా చేసిన పెద్దపులిని ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బెంగాల్ టైగర్ జాతికి చెందిన ఆ పులి పేరు ఇండియా. పులిని చూసినవారు దాని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పులి సంచరిస్తున్నది పిల్లాపాపలతో కూడిన బస్తీ కావడంతో డ్యూటీలో లేని ఓ పోలీసు అధికారి దానిపై తన సర్సీసు రివాల్వర్‌తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు కూడా. ఈ వీడియో కూడా వైరల్ అయింది. కానీ పులి మాత్రం దొరకలేదు. అది ఓ పెంపుడు పులి. 26 ఏళ్ల విక్టర్ హ్యూగో క్యూవస్ దాని యజమాని. అతడు ఓ హత్యకేసులో నిందితుడు. బెయిలు పైన తిరుగుతున్నాడు. పోలీసులు పులి కోసం వీధుల్లో వెతుకుతుండగానే విక్టర్ కారులో పులిని ఎక్కించుకుని ఉడాయించాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఇల్లంతా గాలించినా పులి జాడ కనిపించక పోవడంతో ఖంగు తిన్నారు. పులివేట ఇంకా కొనసాగుతున్నదని ట్విట్టర్లో హ్యూస్టన్ పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు పులి సురక్షితంగా, ఆరోగ్యంగా దొరికింది. దానివల్ల ఇతరులకూ హాని జరగకపోవడంతో పోలీసులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే బరువు ప్రకారం (175 పౌండ్లు) ఆ పులిని పెంపుడు జంతువుగా ఉంచుకోవడం స్థానిక నిబంధనలకు విరుద్ధం. అది ఇంకా పిల్లే. పూర్తిగా ఎదిగితే 600 పౌండ్ల బరువు ఉంటుంది. దాని వాడిగోళ్లు చాలా ప్రమాదకరం. తిక్క రేగితే ఎవరికైనా తీవ్ర నష్టం చేగలదు. కాకపోతే బాగా మచ్చిక చేసింది కావడం వల్ల పెద్దగా ముప్పు ఏర్పడలేదు. ప్రస్తుతం దానిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నారు. హ్యూస్టన్ పోలీసులు ట్విట్టర్లో పెట్టన పులి వీడియోను 47 వేలమందికి పైగా చూశారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>HPD Major Offenders Commander Ron Borza is relieved “India” the ? is now safe: <a href=”https://t.co/3w2CZznKu9″>https://t.co/3w2CZznKu9</a> <a href=”https://t.co/RiNviPFzq3″>pic.twitter.com/RiNviPFzq3</a></p>— Houston Police (@houstonpolice) <a href=”https://twitter.com/houstonpolice/status/1393738103425208323?ref_src=twsrc%5Etfw”>May 16, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు.. కలుపుమొక్క కాంగ్రెస్‌ను నమ్మితే సంక్షేమం సర్వనాశనమైంది : కేటీఆర్
Ranganath | హైడ్రా రంగనాథ్‌ను హైకోర్టుకు పట్టుకురండి.. డీజీపీకి న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్‌రెడ్డి ఆదేశం
Intermediate Education | ఇంటర్ విద్య రద్దు.. పీవీపై అక్కసుతోనే నిర్ణయమన్న ఇంటర్ జేఏసీ
IPL Player Trade | డీల్ డన్.. పాండ్యా, అర్ష్‌దీప్ ట్రేడింగ్‌కు ఆమోదం.. మళ్లీ రోహిత్‌కే ఎంఐ పగ్గాలు?
Ambulance Shortage | కొడంగల్ క్రిటికల్ కేర్..ట్రాక్టరే అంబులెన్స్ రేవంత్ ఇలాకాలో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

