శర్వానంద్ శ్రీకారంపై వెంకయ్య ప్రశంసల జల్లు

శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలలో కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. సేద్యం చేయడం మనందరి బాధ్యత. అధునాతన వ్యవసాయం చేసి రైతుకు అండగా ఉందాం అంటూ శర్వానంద్ శ్రీకారం చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన వెంకయ్య నాయుడు..‘ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చనే చక్కని సందేశం ‘శ్రీకారం’ చిత్రం ద్వారా అందించారని.. యువత చూడాల్సిన సినిమా శ్రీకారం అని కొనియాడారు.
‘వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు.అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం శ్రీకారం’ అంటూ వరుస ట్వీట్స్ చేశారు వెంకయ్య నాయుడు. వెంకయ్య నాయుడు ట్వీట్స్‌పై హీరో శర్వానంద్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలుపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

