నాటింగ్‌హామ్: టెస్టు క్రికెట్లో సునీల్ గవాస్కర్ 10122 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మార్క్‌ను ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ దాటేశాడు. టెస్టుల్లో రూట్ ఇప్పటి వరకు 10191 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ 176 రన్స్ చేశాడు. అయితే గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన రూట్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన 12వ బ్యాటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉన్నారు. సచిన్ టెస్టుల్లో 15921 రన్స్ చేశారు.