ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్..
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను నియమించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈ ప్రకటన చేసింది. ఇటీవల వరుస టెస్ట్ సిరీస్‌ల్లో ఓటమి ఎదురుకావడంతో మాజీ కెప్టెన్ జో రూట్ తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ కనిష్ట స్థాయిలో ఉంది. ఇంగ్లండ్ మెన్స్ జట్టుకు 81వ టెస్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే జూలైలో ఇండియాతో జరిగే టెస్టు మ్యాచ్‌తో స్టోక్స్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారు. మాజీ కెప్టెన్ రూట్ 64 టెస్టులకు బాధ్యతలు చేపట్టాడు. దాంట్లో 27 గెలువగా, 26 మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యారు.
రూట్ విన్నింగ్ శాతం 42.18గా ఉంది. బెన్‌కు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించడంలో తనకు ఎటువంటి ఇబ్బందిలేదని జో రూట్ అన్నాడు. 2013లో స్టోక్స్ టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2017 ఫిబ్రవరిలో అతన్ని వైట్ కెప్టెన్‌గా ప్రకటించారు. అతని టెస్ట్ యావరేజ్ 35.89గా ఉంది. ఇప్పటి వరకు అతను టెస్టుల్లో 5061 రన్స్ చేశాడు. బౌలింగ్‌లో స్టోక్స్ 174 వికెట్లు తీసుకున్నాడు. తనకు కెప్టెన్సీని అప్పగించడం గౌరవంగా భావిస్తున్నట్లు స్టోక్స్ తెలిపాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

