ఎన్నికల తాయిలంగా కోడిపిల్లలు.. పట్టుకున్న అధికారులు
ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయడం మనం చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో బంగారం, వెండి బహుమతులు కూడా ఇస్తుంటారు. మరికొన్నిచోట్ల ఓటర్లను మచ్చిక చేసుకునేదుకు టీవీలు, స్మార్ట్ఫోన్లు ఇచ్చారు. అయితే, ప్రస్తుతం ట్రెండ్ మారింది.
కూనూర్ : ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయడం మనం చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో బంగారం, వెండి బహుమతులు కూడా ఇస్తుంటారు. మరికొన్నిచోట్ల ఓటర్లను మచ్చిక చేసుకునేదుకు టీవీలు, స్మార్ట్ఫోన్లు ఇచ్చారు. అయితే, ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఓటర్లకు కావాల్సిన వస్తువులను చేరవేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యువజన సంఘాలకు జిమ్ కిట్లు, స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లే.. గిరిజనులకు వాళ్లు పెంచుకునే కోడిపిల్లల్ని కూడా పంచేందుకు సిద్ధమయ్యారు మన నేతలు.
తమిళనాడులో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకుని అధికారంలోకి రావాలని ఎవరికి వారే లెక్కలు వేసుకుంటూ పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు. ఓ అభ్యర్థి ఒక అడుగు ముందుకేసి కూనూర్‌లో గిరిజనులు పెంచుకునే కోడిపిల్లలు పంచాలని అనుకున్నాడంట. ఇంకేం ఓ వ్యానులో 4,500 కోడిపిల్లల్ని తరలించే పని చేపట్టగా.. అపోజిషన్ వాళ్లు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌కు ఉప్పందించారు. ఇంకేం ఆగమేఘాల మీద లఘించుకొని వచ్చిన అధికారులు.. వ్యానులో తరలింపునకు సిద్ధంగా ఉన్న కోడిపిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని కూనూర్ సబ్ కలెక్టర్‌కు స్వాధీనపర్చారు. వీటిని సమీపంలోని మూడు గిరిజన గ్రామాల్లో పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు పట్టుబడిన వారు ఒప్పుకోవడంతో సదరు అభ్యర్థిపై కేసు నమోదైంది. తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఈ నెల 12 నుంచి మొదలవుతుంది. మే 2 న ఫలితాలు వెలువడతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

