Dubbak | కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం.. నేడు దుబ్బాక బంద్
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆందోళనలు చేపట్టా రు.
Dubbak | సిద్దిపేట(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ దుబ్బాక, అక్టోబర్ 30: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆందోళనలు చేపట్టా రు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి పై, అందుకు బాధ్యులైన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దుబ్బా క, దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, తొగు ట, చేగుంట, నార్సింగ్, అక్బర్పేట-భూంపల్లి మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సం ఖ్యలో ర్యాలీలు నిర్వహించారు. దుబ్బాకలో రఘునందన్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు.
హత్యాయత్నం ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు మంగళవారం దుబ్బాక నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని మండలకేంద్రాల్లో, ప్రతి గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు నల్లజెండాలతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. కాగా, కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించేందుకు మెదక్ పార్లమెంట్ పరిధి సహా దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ నేతలు దవాఖానకు తరలివచ్చారు. బీజేపీకి, దుబ్బా క ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు వ్యతిరేకంగా దవాఖాన ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీజేపీ డౌన్‌డౌన్.. ఎమ్మెల్యే రఘునందన్‌రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ గుండాల్లారా ఖబడ్దార్ అని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

