మనం మునక్కాయలను విరివిగా వాడుతాం. సాంబారులో కచ్చితంగా వేస్తాం. అయితే.. మునగ కాయలే కాదు, వాటి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కారణం మునగలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండటమే.
సూపర్ ఫుడ్ : నారింజ పండులో కంటే ఎక్కువ విటమిన్-సి, గ్లాసు పాలలో కంటే ఎక్కువ క్యాల్షియం, అరటిపండులో కంటే ఎక్కువ పొటాషియం, పాలకూరలో కంటే ఎక్కువ ఐరన్
మునగాకులో ఉంటుంది.
లాభాలు : మునగలోని జింక్, బీటా కెరోటీన్, విటమిన్-ఇ మొదలైనవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. మెదడు ఎదుగుదలకు, మానసిక సమస్యలను దూరం చేసేందుకు కూడా మునగ తోడ్పడుతుంది. క్యాన్సర్ నివారణలోనూ ఉపయోగపడుతుంది. కొన్ని
రకాల కాలేయ వ్యాధుల చికిత్సకు మునగ ఉపకరిస్తుంది. మునగాకుతో పప్పు, తాలింపు చేసుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసుకుని అన్నంలోనూ కలుపుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, మునగాకు.. అనారోగ్యాల సుడి గుండం నుంచి మనల్ని ఒడ్డున పడేస్తుంది.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri@trudiet.in