న్యూయార్క్, ఏప్రిల్ 10: అధిక బరువు ప్రపంచవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్ని తగ్గించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి ఔషధాలు లేవు. కొన్ని రకాల సర్జరీలు ఉన్నా అవి ప్రాణాలకు ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, అమెరికాకు చెందిన పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకులు కార్నెల్ వర్సిటీ శాస్త్రవేత్తలతో కలిసి అధిక బరువుకు చెక్ పెట్టే డ్రగ్‌ను తయారు చేశారు.
ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో పురోగతి సాధించారు. దీనికి ‘సీపీఏసీసీ’ అని నామకరణం చేశారు. ఈ డ్రగ్ మైటోకాండ్రియాలో మెగ్నీషియం రవాణాను నియంత్రించి బరువు పెరగకుండా సహాయపడుతున్నదని గుర్తించారు.