Drinking | యుక్త వయస్సులో మద్యం అధికంగా సేవిస్తే.. తరువాతి కాలంలో ఇబ్బందే.. అధ్యయనంలో వెల్లడి..
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిందే. కాలేయ సమస్యలు, గుండె వ్యాధులు, వ్యసనం వంటి అనేక సమస్యలకు ఇది కారణమవుతుంది. అయితే తాజా పరిశోధన ప్రకారం యుక్త వయస్సులో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యం సేవించడం మధ్య వయస్సులో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వెల్లడైంది.
Drinking | మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిందే. కాలేయ సమస్యలు, గుండె వ్యాధులు, వ్యసనం వంటి అనేక సమస్యలకు ఇది కారణమవుతుంది. అయితే తాజా పరిశోధన ప్రకారం యుక్త వయస్సులో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యం సేవించడం మధ్య వయస్సులో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వెల్లడైంది. అల్కహాల్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అంహెర్స్ట్ పరిశోధకులు నిర్వహించారు. దీని ప్రకారం యువ దశలో ఒత్తిడి కారణంగా మద్యం సేవించిన వారు, తరువాత కాలంలో పూర్తిగా మానేసినా కూడా మెదడు పనితీరులో మార్పులు కొనసాగుతాయని తేలింది.
దీర్ఘకాలంలో మెదడుపై ప్రభావం..
ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన బయాలజీ ప్రొఫెసర్ ఎలీనా వాజీ మాట్లాడుతూ మద్యం, ఒత్తిడి కలిసి మెదడులో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపారు. ముఖ్యంగా యువ దశలో మెదడు ఇంకా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలామంది మద్యం సేవిస్తారు. తాత్కాలికంగా ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే దీర్ఘకాలంలో మెదడు సహజంగా ఒత్తిడిని నియంత్రించే సామర్థ్యాన్ని ఇది దెబ్బతీస్తుంది. ఫలితంగా ఒక దుష్చక్రంగా ఏర్పడుతుందని, ఎక్కువగా మద్యం సేవించడం, దానివల్ల తప్పు నిర్ణయాలు తీసుకోవడం, మరింత ఒత్తిడి పెరగడం, మళ్లీ మద్యం వైపు మళ్లడం వంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎలుకలపై ప్రయోగాలు..
ఈ అధ్యయనంలో ఎలుకలపై ప్రయోగాలు చేశారు. యువ దశలో వాటికి అధిక మద్యం, దీర్ఘకాలిక ఒత్తిడిని కలిపి ఇచ్చి, తరువాత కొన్ని నెలల పాటు మద్యం పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ మధ్య వయస్సుకు సమానమైన దశలో ఆ ఎలుకలు కొత్త పరిస్థితులకు తగినట్లు ఆలోచించడంలో ఇబ్బంది పడ్డాయి. అంటే కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయింది. ఈ ప్రభావాలకు ప్రధాన కారణం మెదడులోని లోకస్ కోరూలియస్ అనే భాగంలో వచ్చిన మార్పులు. సాధారణంగా ఇది ఒత్తిడిలో పనిచేసి తరువాత ప్రశాంత స్థితికి వస్తుంది. కానీ మద్యం, ఒత్తిడి ప్రభావంతో ఇది ఎప్పుడూ అధికంగా పనిచేస్తూ ఉంటుంది. దీంతో నిర్ణయాలు తీసుకోవడంలో, పరిస్థితులకు అనుగుణంగా మారడంలో సమస్యలు వస్తాయి.
ప్రత్యేక చికిత్సలు అవసరం..
ఇంకా ఈ పరిస్థితిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే సెల్ స్థాయి నష్టం కూడా పెరుగుతుంది. ఇది అల్జీమర్స్ వంటి వ్యాధులతో సంబంధం ఉన్న ఒక సూచిక. దీని వల్ల మెదడు కోలుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంతకు ముందు మద్యం ఎక్కువగా తీసుకున్న వారు మళ్లీ ఒత్తిడిలో పడినప్పుడు మద్యం వైపు తిరిగి వెళ్లే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. మధ్య వయస్సులో జీవన ఒత్తిడులు పెరిగే సమయంలో, ఈ ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కొత్త పరిస్థితులకు తక్షణంగా స్పందించలేకపోవడం, ఆలోచనా సామర్థ్యం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి డిమెన్షియా ప్రారంభ దశలకు దగ్గరగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యువ దశలో మద్యం, ఒత్తిడి కలయిక మెదడుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఒకసారి ఈ మార్పులు జరిగితే, మద్యం మానేయడం మాత్రమే సరిపోదు. మెదడు పనితీరును మెరుగుపరచడానికి ప్రత్యేక చికిత్సలు అవసరమవుతాయని పరిశోధకులు సూచిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- drinking
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

