Beauty tips | మీ లావు పొట్ట స్లిమ్‌గా మారాలా.. అయితే ఈ ఫుడ్ ఐటమ్స్‌ను పక్కన పెట్టాల్సిందే..!
Beauty tips : ఎవరైనా తాము స్లిమ్‌గా, ట్రిమ్గా ఉండాలనే కోరుకుంటారు. యువతలో అయితే ఈ కోరిక మరీ ఎక్కువ. అందుకే పొట్ట తగ్గించుకోవడం కోసం రోజూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అంటూ ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. ఎంత చేసినా పొట్ట తగ్గడం లేదంటూ నిరాశ చెందుతుంటారు. వాస్తవానికి పొట్ట తగ్గించుకోవాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు. వ్యాయామంతోపాటు కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. పొట్ట లావెక్కే పదార్థాలను దూరం పెట్టాలి. మరి ఆ పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం..

1. చక్కెర
నోటికి తియ్యగా ఉండే ఈ పదార్థం మన శరీరానికి మాత్రం తీవ్ర హాని చేస్తుంది. ఒక కప్పు చక్కెరలో 773 క్యాలరీస్ ఉంటాయి. దీనివల్ల ఊబకాయం రావడమే కాకుండా మధుమేహం వంటి ఇతర రోగాలు కూడా అంటుకుంటాయి. కాబట్టి చక్కెరను కూడా దూరం పెట్టాల్సిందే.
2. కూల్‌డ్రింక్స్
కూల్‌డ్రింక్స్ కూడా ఊబకాయం, లావు పొట్టకు కారణమవుతాయి. 12 ఔన్సుల డ్రింక్‌లో దాదాపు 140 క్యాలరీస్ ఉంటాయి. అందువల్ల నాజూకు పొట్ట కోరుకునే వాళ్లు కూల్ డ్రింక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచింది.
3. ఆలుగడ్డ
అందరికి బాగా నచ్చే కూరగాయ ఈ ఆలుగడ్డ. కానీ ఊబకాయులకు ఈ ఆలుగడ్డ మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఒక ఎగ్ సైజు ఆలుగడ్డలో 163 క్యాలరీలు ఉంటాయట. ఈ క్యాలరీలు పొట్ట పెరుగడానికి కారణం అవుతాయట.
4. ఫాస్ట్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్ అనే మాట వింటే చాలు ఎవరికైనా నోరూరుతుంది. కానీ ఈ ఫాస్ట్ ఫుడ్‌కు ఊబకాయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఫాస్ట్‌ఫుడ్ తింటే పొట్ట పెరుగుతుంది. అందువల్ల పొట్ట తగ్గాలంటే ఫాస్ట్‌ఫుడ్‌ను పక్కన పెట్టాల్సిందే.
5. మరికొన్ని పదార్థాలు
పైన పేర్కొన్న వాటితోపాటు బేకరీ ఫుడ్స్, వేపుళ్లు, స్వీట్లు, చాక్లెట్లు, దుంపలు ఊబకాయానికి, లావు పొట్టకు కారణం అవుతాయి. అందువల్ల వాటిని కూడా దూరం పెట్టాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్