Lizards | ఇంట్లో బల్లులు తిరుగుతుంటే ఇరిటేషన్‌గా ఉందా.. అయితే ఈ టిప్స్ పాటించండి..!
Lizards | ఇంట్లో బల్లులు తిరుగుతుంటే కొందరికి ఒల్లు జలదరిస్తుంది. అవి వంటల్లో ఎక్కడ పడుతాయోనని కొందరు భయాందోళనకు గురవుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని చిన్నచిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
Lizards : ఇంట్లో బల్లులు తిరుగుతుంటే కొందరికి ఒల్లు జలదరిస్తుంది. అవి వంటల్లో ఎక్కడ పడుతాయోనని కొందరు భయాందోళనకు గురవుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని చిన్నచిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, బల్లులకు పడని పదార్థాలను ఇంట్లో ఉంచడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి బల్లికి పడని ఆ పదార్థాలేమిటో, పాటించాల్సిన టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. పరిశుభ్రత
బల్లులు ఊరికెనే ఇంట్లోకి రావు. మీ ఇంట్లో ఆహారం దొరికితేనే అవి ఇంట్లో దూరుతాయి. చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు బల్లిని ఆహ్వానిస్తుంది. కాబట్టి బల్లులు రావద్దంటే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
2. నిమ్మ
నిమ్మ లాంటి సిట్రస్ జాతి మొక్కల వాసన కేవలం బల్లులే కాదు, ఏ పురుగులకు కూడా పడదు. సిట్రస్ పండ్లను, ఆకులను బల్లులు, పురుగులు అసహ్యించుకుంటాయి. కాబట్టి నిమ్మకాయ ముక్కలనుగానీ, నిమ్మ ఆకులనుగానీ బల్లులు తిరిగేచోట పెడితే అవి రాకుండా ఉంటాయి. అంతేగాక నిమ్మగడ్డిని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేస్తే కూడా బల్లులు దరిచేరవు.
3. కర్పూరం
కర్పూరం వాసన కూడా బల్లులకు అస్సలు పడదు. కర్పూరం వాసన వాటికి ఎలర్జీ ఫీల్‌ను ఇస్తుందట. అందుకే కర్పూరానికి దూరంగా ఉంటాయట. కాబట్టి ఇంట్లో అక్కడక్కడ కర్పూరం బిళ్లలు పెడితే బల్లులు దెబ్బకు పారిపోతాయి.
4. చల్లదనం
బల్లులు చల్లదనాన్ని భరించలేవు. ఇవి ఎక్కువగా వేడిగా ఉండే ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుతాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడితే బల్లులు తట్టుకోలేవు. కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు ఏసీని పెంచండి. దాంతో బల్లులు కనిపించకుండా పోతాయి. లేదంటే ఓ స్ప్రే బాటిల్లో చల్లటి నీళ్లు తీసుకుని వాటిపై స్ప్రే చేసినా బల్లులు పారిపోతాయి.
మరికొన్ని చిట్కాలు
పెప్పర్ స్ప్రే మంటను కూడా బల్లులు తట్టుకోలేవట. కాబట్టి పెప్పర్ స్ప్రేను చల్లడం ద్వారా బల్లుల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
కాఫీ, తంబాకు మిక్సింగ్ వాసన కూడా బల్లులకు పడదు. కాబట్టి వాటి మిశ్రమం వాసన చూపిస్తే బల్లులు పారిపోతాయట.
ఆపిల్ సైడర్ వెనిగర్ వాసన కూడా బల్లులకు పడదు. కాబట్టి ఆపిల్ సైడర్ వెనిగర్‌ను స్ప్రే చేస్తే బల్లులు పరారవుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

